కొండపి: పొన్నలూరు మండలంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం
ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. పొన్నలూరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలవగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. వేసవిలో వేడిమికి అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. కల్లూరివారిపాలెంలో కురుస్తున్న వర్షం వీడియోలో చూడవచ్చు. మీ ప్రాంతంలో వర్షం ఉందా కామెంట్.