దర్శి: పోలవరం గ్రామంలో తన పొలంలో రైతు సజీవ దహనమై అక్కడికక్కడే మృతి
Darsi, Prakasam | May 25, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు పొలంలో మొక్కజొన్న వ్యర్ధాలను తగలబెడుతుండగా మంటలు బోరు వైపుకు అంటుకుంటాయని ఆత్రుతతో అటుగా పరిగెత్తాడు. ఆ క్రమంలో మొక్కజొన్న దుంప తగిలి కింద పడిపోవడంతో మంటలు చుట్టుముట్టాయి. అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామములో తీవ్ర విషాదం నెలకొన్నది.