రాయదుర్గం: టిడిపి తాజా మాజీ సర్పంచ్ లను సన్మానించిన ఎమ్మెల్యే, తన అనుభవం పంచుకున్న సర్పంచ్ జయరాం చౌదరి
వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య సహా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేలా బాద్యత తీసుకోవాలని తాజా మాజీ సర్పంచ్ లకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పిలుపునిచ్చారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న టిడిపి సర్పంచ్ లకు రాయదుర్గంలోని టిడిపి కార్యాలయంలో శాలువాలతో సత్కరించి వారి సేవలు కొనియాడారు. ఈ సమావేశంలో సీనియర్ నేత ఎన్. హనుమాపురం తాజా మాజీ సర్పంచ్ జయరాం చౌదరి మాట్లాడుతూ మూడున్నర ఏళ్లు రాక్షస పాలనలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కి ఒక్కరూపాయి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక లక్ష ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యంగా