దర్శి: దొంగతనానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపిన దర్శి సీఐ రామారావు
ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని తాళ్లూరు దొనకొండ పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. గుడిగంటలు హుండీ దొంగతనాలు సేదించినట్లు తెలిపారు. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని వారి నుంచి ఒక మొబైల్ నల్లపూసల దండ చెవి దిద్దులు సుమారు రెండు లక్షలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని దర్శి న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.