యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండల కేంద్రంలో గ్యాస్ బుక్ చేసిన ఇవ్వటం లేదని వాహనాన్ని అడ్డుకొని ఆందోళన చేసిన స్థానికులు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో గ్యాస్ బుక్ చేసి 15 రోజులు పైగా అయినా గ్యాస్ ఇవ్వడం లేదని వాహనాన్ని అడ్డుకొని స్థానికులు ఆందోళనకు దిగారు. ఏప్రిల్ 29వ తేదీ బుక్ చేసిన ఇప్పటివరకు గ్యాస్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో గ్యాస్ ఇవ్వలేని వారు కనెక్షన్ ఎందుకు ఇచ్చారని వాహన డ్రైవర్ నిలదీశారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన తర్వాతే వెళ్లాలని డిమాండ్ చేశారు.