యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం పై పలు విమర్శలు చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏపీలోని కూటమి రాజకీయాలపై విమర్శలు చేశారు తమిళనాడులో సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఒంటరిగా ఘనత సాధించిన ఆయనను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కలిసి ప్రజలకు మంచి చేయకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల జెండాలు మోయకుండా ఒంటరిగా నిలబడి తనకంటూ ప్రత్యేక నాయకుడిగా రాణించాలని హితవు పలికారు.