మార్కాపురం: మార్కాపురం పట్టణంలో డీజిల్ పెట్రోల్ కొరతతో తీవ్ర అవస్థలు పడ్డ వాహనదారులు, పెట్రోల్ బంక్ యాజమాన్యాల తీరుపై ఆగ్రహం
మార్కాపురం పట్టణంలో శనివారం వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కొన్ని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని ప్రాంతాలలో పెట్రోల్ దొరకగా అక్కడ వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కావాలని పెట్రోల్ కొరత సృష్టిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.