యర్రగొండపాలెం: ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన బాదితుడు కొండయ్య
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం, కొమరోలు రెవెన్యూ పరిధిలోని కుందంపల్లిలో సర్వే నెంబర్ 199లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్తుడు కొండయ్య తెలిపారు. అంతేకాకుండా గొర్రెలకు గేదెలకు మేతకు ఉపయోగపడేది అన్నారు. కానీ ఆ గ్రామానికి చెందిన ఐదు మంది వ్యక్తులు కబ్జా చేసి భూముల్లోకి రానివ్వడం లేదన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ సునీతకు వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.