మార్కాపురం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్ వాడకం పెంపొందించుకోవాలని సూచించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత సైకిల్ తొక్కి పర్యావరణం పై అవగాహన కల్పించారు. పట్టణంలో నాలుగు మాడవీధుల గుండా స్వయంగా సైకిల్ తొక్కుతూ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు