తాడిపత్రి: ముప్పాల గుత్తి గ్రామంలో విషాదం, అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
పెద్దవడుగూరు మండలం ముప్పాల గుత్తి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు అప్పుల బాధ తాళలేక ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగేళ్లుగా పంటలు సరిగా పండగ పోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.