రాయదుర్గం: గుప్తనిధుల వేటగాళ్ల నుంచి పశుపతి నాథ ఆలయాన్ని రక్షించడంలో ప్రభుత్వం విఫలం :VHP జిల్లాఉపాధ్యక్షులు దేవరెడ్డిపల్లి రాజేష్
రాయదుర్గం మండలం లింగాలబండ పశుపతి నాథ దేవాలయాన్ని గుప్త నిధుల వేటగాళ్ల నుంచి కాపాడడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యాయని VHP జిల్లా ఉపాధ్యక్షులు దేవరెడ్డిపల్లి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక దేవాలయం పదేపదే తవ్వకాలతో ధ్వంసమవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం వీడియో ప్రకటన విడుదల చేశారు.