రాయదుర్గం: పట్టణంలో అధికారులతో కలిసి అంబేడ్కర్ కు ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కు స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా మంగళవారం రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం వద్ద స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, కమీషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్, టిడిపి నేతలతో కలిసి లు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మహనీయుడి ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.