కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏటీఎం కేంద్రాలను సందర్శించి, భద్రతను పర్యవేక్షించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బుధవారం ఏటీఎం కేంద్రాలను స్థానిక పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతలు పరిశీలించి సెక్యూరిటీ గాడ్లతో మాట్లాడారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ అలారం వంటివి నిరంతరం పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి మరమ్మత్తురుకు గురైనట్లయితే వెంటనే వాటిని బాగు చేయించాలని తెలిపారు. అంతేకాకుండా ఏటీఎం కేంద్రాల సమీపంలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు వారికి సూచించారు.