రాయదుర్గం: నేమకల్లు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
బొమ్మనహల్ మండలం నేమకల్లు ఆంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గర్భగుడి తొలగింపు కారణంగా భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ ప్రాంగణంలో బాలాలయం ఏర్పాటు చేసి చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యపూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం మూలవిరాట్ కు గంగ పూజ, హోమాలు నిర్వహించారు. శనివారం విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనాథ్ తెలిపారు.