రాయదుర్గం: పట్టణంలోని అంబేడ్కర్ వాసులు నీటికోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నా, స్థంభించిన ట్రాఫిక్
రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రోజూ ఎక్కడో ఒకచోట ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. 22వ వార్డు అంబేడ్కర్ నగర్ కొల్లాపురమ్మ వీధిలో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహించిన మహిళలు, స్థానిక యువకులు శుక్రవారం సాయంత్రం ఊరువాకిలి దగ్గర రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేశారు. దీంతో అరగంటపాటు మొలకల్మూరు రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులుతో పాటు టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు.