యర్రగొండపాలెం: మే 21వ తేదీ దోర్నాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మే 21వ తేదీ పర్యాటిస్తున్నట్లు టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలకు ముగింపు పలికేలా దూపాడు నుండి దోర్నాలకు సాగర్ జలాల పైపులైన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మంత్రి చేతుల మీదుగా సాగర్ నీటిని విడుదల చేస్తారని పేర్కొన్నారు.