గిద్దలూరు: రాచర్ల మండలంలో అకస్మాత్తుగా భారీ వర్షం, ఉరుములు మెరుపులతో ఆందోళన చెందిన స్థానిక ప్రజలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో ఆదివారం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారిన వాతావరణంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసాయి.