కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శులు, జయంతి బాబు, వెంకట్రావు
కొండపిపొగాకువేలంకేంద్రంను మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పమిడి వెంకటరావు జయంతిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వింటా పొగాకు 30 వేలరూపాయలు గిట్టుబాటుధరఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది 280 కేజీ ధర పలకగా ఈ ఏడాది 250 రూపాయలు ధర రావడంతో రైతులు కృంగిపోయారని వారఅన్నారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు మీద ఉన్న జిఎస్టి వెంటనే రద్దు చేసే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించి పొగాకు కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.