మార్కాపురం: మేకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద 15 కోట్ల ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
తర్లుపాడు మండలం మేకల వారి పల్లి టోల్ ప్లాజా వద్ద 15 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్కును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒకరు పారిశ్రామికవేత్త కావాలన్నారు. చిన్న పరిశ్రమలైన సరే ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.