యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామానికి నూతన తారు రోడ్డు నిర్మాణంతో ఎదురుచూస్తున్న ఎన్నో ఏళ్లుగా నిజమైన కల
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామానికి నూతన తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఊరు పుట్టిన తర్వాత ఇంతవరకు తారు రోడ్డు లేదని వైపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని బూత్ కన్వీనర్ కంచర్ల తిరుపాలు గౌడ్ అన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నిజమైందని సమస్య పరిష్కారమైనందున ఎరిక్షన్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు