దర్శి: దర్శి శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరానికి మంచి స్పందన : గ్రంథ పాలకురాలు విజయ్ కుమారి
Darsi, Prakasam | Apr 29, 2025 దర్శిలో శాఖ గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ శిబిరంలో కొనసాగిస్తున్న కార్యక్రమాలను రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో హాజరైన విద్యార్థులకు నీతి కథలు, విజ్ఞానానికి సంబంధించిన పలు రకాల పుస్తకాలను అందించి, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. గ్రంథ పాలకురాలు వట్టెం విజయ కుమారి మాట్లాడుతూ.. విజ్ఞానమును అందించే గ్రంథాలయాలను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.