యర్రగొండపాలెం: దోర్నాల మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కింద పడిపోయిన మద్యం బాటిల్స్
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో బెల్టు షాపుల నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోర్నాలలోని ఓ వైన్ షాపు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి బైక్ పై వెళ్తుండగా కింద పడిపోయాడు. దీంతో సంచుల్లో తీసుకెళ్తున్న మద్యం సీసాలు బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.