యర్రగొండపాలెం: పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలలో టిడిపి నాయకుల సమావేశం
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో, త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు స్థానిక సమస్యలపై సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.