గిద్దలూరు: గిద్దలూరులో ద్విచక్ర వాహనాలు అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందాయి. నియోజకవర్గంలో పదిమంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా అందడంతో దివ్యాంగులు ఎమ్మెల్యే అశోక రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద దివ్యాంగులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని సన్మానించి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే కోటకు ప్రభుత్వం బస్సులో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించిందని 3000 నుంచి 6 వేలకు పెన్షన్ కూడా పెంచడంపై దివ్యాంగులు ఆర్షం వ్యక్తం చేశారు.