కొండపి: పాకాల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను అర్ధరాత్రి అధికారతో కలిసి పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఫిబ్రవరి 14, 15 తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి శుక్రవారం అర్ధరాత్రి పరిశీలించారు. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు.