రాయదుర్గం: ఆవులదట్ల వద్ద 10 మంది పేకాటరాయుళ్ళ అరెస్టు, కేసు నమోదు
రాయదుర్గం మండలం అవులదట్ల గ్రామ శివారులోని ఒక చెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో రాయదుర్గం పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మికంగా రైడ్ నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది వ్యక్తులు పట్టుబడగా, ఒక వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి రూ.21,200 నగదు, 7 మొబైల్ ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయనాయక్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.