రాయదుర్గం: పట్టణంలోని 5 వ వార్డులో స్పెషల్ డ్రైవ్ ద్వారా మురుగు నీటి సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు
రాయదుర్గం పట్టణంలోని 5 వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం మద్యాహ్నం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, వార్డు ఇన్చార్జ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కడ్డిపూడి మహబూబ్ బాషా, శ్యానిటరీ ఇనిస్పెక్టర్ రవీంద్ర యాదవ్ ల ఆధ్వర్యంలో గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయించారు. ఇటీవల రాయదుర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి డ్రైనేజీ సమస్యఫై విన్నవించారు. దీంతో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినట్లు కమీషనర్ తెలిపారు.