కొండపి: గిద్దలూరులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా గిద్దలూరు సభలో సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మైనస్లో ఉందన్నారు. 'మీ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. మంత్రి స్వామి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి' అని సూచించారు. 'నేను అధికారులకు చెబితే అది మంత్రులకు కాదని అనుకోవద్దు. శాఖ పనితీరుకు చివరికి బాధ్యత శాఖాధిపతి, కలెక్టర్పైనే ఉంది' అని అన్నారు.