గిద్దలూరు: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో విద్యుత్ షాక్ వల్ల ఆరు గేదెల మృతి, రూ.4 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయిన రైతులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మేత కోసం వెళ్ళిన 6 గేదలు విద్యుత్ షాక్ లో మృతి చెందాయి. ఆకవీడు గ్రామానికి చెందిన రైతులు రంగస్వామి రెడ్డి, గురయ్యా, రంగస్వామి తమ గేదలను మేత కోసం గ్రామ సమీపంలో విడిచిపెట్టారు. మేతమేస్తూ ఓ పొలంలోకి వెళ్ళిన ఆరు గేదలు విద్యుత్ తీగలను తగలడంతో గేదలు అక్కడికక్కడే మృతి చెందాయి. గేదలు మృతి చెందడం వల్ల దాదాపు రూ.4 లక్షలు వరకు ఆర్థికంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.