మార్కాపురం: పదో తరగతి విద్యార్థులకు పలు కీలక సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాలు అపజయాలు సహజమని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలన్నారు.