రాయదుర్గం: ఈనెల 26 న జరిగే బిసి గళం సదస్సుకు తరలిరండి : వైఎస్సార్సీపీ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు దేవేంద్ర
ఈనెల 26 న అనంతపురంలో జరిగే బిసి గళం సదస్సుకు పెద్ద ఎత్తున తరలిరావాలని వైఎస్సార్సీపీ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు దేవేంద్ర, రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాయదుర్గంలో బిసి విభాగం నాయకులు కార్యకర్తలతో కలిసి బిసి గళం పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం బిసి విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. బిసిలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే వనన్నారు కూటమి ప్రభుత్వం మాది బిసి ల ప్రభుత్వం అని చెబుతూ బిసి లపై దాడులు చేస్తోందని, భయబ్రాంతులకు గురి చేస్తోందని ద్వజమెత్తారు.