యర్రగొండపాలెం: త్రిపురాంతక మండలం నాగరాజు కాలనీలో కార్డాన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, 40 దిచక్ర వాహనాలు స్వాధీనం
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని నాగరాజు కాలనీలో శనివారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులను కొత్త వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించారు.