మార్కాపురం: మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో రీ సర్వే గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిధి ఎమ్మార్వో చిరంజీవి మాట్లాడారు. 1908-10 బ్రిటిష్ కాలంలోనే గ్రామానికి సంబంధించి ఆర్ఎస్ఆర్ లో 973 సర్వే నెంబర్లు కలిగి ఉండి 8వేల 62 సెంట్లు భూమి నమోదు అయిందన్నారు. ఇందులో పట్టా, దేవాలయ, ప్రభుత్వ, అసైన్మెంట్ భూములు ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఆర్ ఆధారంగానే మిగతా రికార్డులను తయారు చేస్తున్నామన్నారు. రీ సర్వే పై అవగాహన కల్పించారు.