మార్కాపురం: అల్లూరి పోలేరమ్మ ఆలయం వెనక వైపు ప్లాట్ లలో రాళ్లు తొలగించడంతో ఆందోళన చెందుతున్న బాధితులు
మార్కాపురం శివారు ప్రాంతంలో వెళుతున్న అల్లూరు పోలేరమ్మ ఆలయం వెనకవైపు ప్లాట్ లలో వేసిన రాళ్లను ఎవరికి తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. అందులో సుమారు 240 మందికి సంబంధించిన ప్లాట్లు ఉన్నాయి. దీంతో బాధితులు స్థలం వద్దకు వెళ్లి రాళ్ళను ఏర్పాటు చేశారు. మళ్లీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రాళ్లను తొలగించడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు