తాడిపత్రి: యాడికిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేస్తాం: యాడికి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
యాడికిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. యాడికి లో సోమవారం జలధార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాట్లాడారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి యాడికి లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారన్నారు. ఆయన కోరిక, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు.