విశాఖపట్నం: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వినాయక చవితి మండపాలకు సింగిల్ విండో అనుమతులు, ఉచిత విద్యుత్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్పందించిన బీజేపీ విశాఖ అధ్యక్షులు పరశురామ రాజు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.