గిద్దలూరు: అకాల వర్షంతో నేలకొరిగిన అరటిపంట అరటి రైతును ఆదుకోవాలని గిద్దలూరు రైతు వేడుకోలు,
గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో అరటిపంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోయామని గత సంవత్సరం కూడా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదని రైతు తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని రైతులు బురుజుపల్లి రైతులు వేడుకుంటున్నారు. దాదాపు 100 ఎకరాలకు పైగా బురుజు పల్లి గ్రామంలో పంట చేసినట్లు రైతు తెలిపాడు.