విశాఖపట్నం: ఏపీకి భారీ పెట్టుబడులు: 8,132 కోట్ల ఒప్పందాలు, 14 వేల మందికి ఉపాధి
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ లో ఏపీకి రూ.8,132 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8 ఎంఓయూల ద్వారా 14,375 మందికి ఉపాధి లభించనుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పోర్టులు, ఏరోస్పేస్ రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.