మార్కాపురం: 17వ వార్డులో సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన కమిషనర్ నారాయణరావు
మార్కాపురం పట్టణంలోని 17వ వార్డులో సర్ ప్రత్యేక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్ట్ డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా బి ఎల్ వో లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సంబంధించిన ధ్రువపత్రాల పూర్తి చేయడంలో ఉన్న సందేహాలను బి ఎల్ వో లకు నివృత్తి చేయడం జరిగిందన్నారు. ప్రజలు బిఎల్వోలు తమ ఇంటికి వచ్చినప్పుడు సహకరించి సంబంధిత పత్రాలను వారికి ఇవ్వాలన్నారు. మళ్లీ మళ్లీ వారిని తిప్పకుండా సకాలంలో సంబంధిత వివరాలతో పాటు జిరాక్స్ పత్రాలని ఇచ్చి సహకరించాలని కోరారు.