మార్కాపురం: పోతలపాడు అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ చిన్న పిల్లలకు గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా వంటి విషయాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారి ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.