ఉరవకొండ: పెన్నహోబిలంలో అత్యంత ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకీ ఉత్సవం
ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు. అర్చకులు, భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు, హారతులు వంటి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.