కళ్యాణదుర్గం: కుందుర్పిలోని విద్యుత్ నగర్ లో తీవ్ర తాగునీటి ఎద్దడి
కుందుర్పి విద్యుత్ నగర్ లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్య గురించి గ్రామస్తులు తెలియజేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో మంగళవారం పలువురు గ్రామస్తులు మాట్లాడారు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.పంచాయతీ అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.