రాయదుర్గం: బకాయి పడ్డ వేతనాల కోసం సత్యసాయి కార్మికుల సమ్మె ఉదృతం
సత్యసాయి వాటర్ వర్కర్స్ చేపట్టిన సమ్మె ఉదృతమవుతోంది. 6 రోజులు వివిధ రూపాల్లో నిరసన చేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆదివారం డి.హిరేహాల్ మండలం గొడిశలపల్లి పంపు హౌస్ వద్ద వినూత్న రీతిలో అర్దనగ్న నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైటాయించారు. తమ గోడు ప్రభుత్వం ఆలకించాలని వేడుకున్నారు. తక్షణమే బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని యూనియన్ నాయకులు కోరారు.