దర్శి: మల్లంపేట గ్రామంలో సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
Darsi, Prakasam | Apr 13, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో సోలార్ విద్యుత్ పథకాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న మూడు నాలుగు నెలల లో దర్శి నియోజకవర్గ పరిధిలో నాలుగువేల ఇండ్లకు 50.39 కోట్లతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీఎస్ ద్వారా 147 కోట్లతో గ్రామాలకు పొలాలకు వేరువేరుగా విద్యుత్ అందించడానికి నూతన స్తంభాలు ఏర్పాటుకు 115 కోట్లు పనులు పూర్తి చేశామన్నారు.