రాయదుర్గం: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు బుధవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు చెందిన 36 మందికి రూ.10 లక్షల విలువైన చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఆపద సమయాల్లో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సిఎం సహాయనిధి ఎంతో ఊరటను ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. హితోదిక సహాయం అందజేసిన సిఎం కు కృతజ్ఞతలు తెలిపారు.