మార్కాపురం: ఉద్యోగంలో చేర్చుకోకపోవడంతో కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని తర్లుపాడు టి ఏ మహబూబ్ బాషా ఆవేదన
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మూడు సంవత్సరాలుగా టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన మహబూబ్ బాషాను ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా తొలగించిన భాషాను సంజాయిషీ చెప్పుకొని పీడి నుండి ఏప్రిల్ 10వ తేదీ జాయినింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఉద్యోగం కల్పించకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు