కొండపి: రాబోయే రోజుల్లో లోకేష్ తప్పనిసరిగా సీఎం అవుతారు: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
రాబోయే రోజుల్లో కూటమి భాగస్వామ్యంతో నారా లోకేశ్ సీఎం అవుతారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఒంగోలులో మెప్మా ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ఆయన 'ఎగ్ మార్ట్స్' పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం మెప్మా ద్వారా పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.