రాయదుర్గం: వర్షానికి జలమయమైన శాంతినగర్ కృష్ణమూర్తి లేఔట్ ఏరియా, నరకయాతన అనుభవిస్తున్న కాలనీ వాసులు
రాయదుర్గం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి శాంతినగర్ కృష్ణమూర్తి లేఔట్ ప్రాంతం జలమయమైంది. కొండపై నుంచి ఉధృతంగా వచ్చే వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక నేరుగా ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. వంక పూర్తిగా ఆక్రమణకు గురికావడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఈ ముంపునకు ప్రధాన కారణమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చిన ప్రతీ సారి తమ ఇళ్లు మునిగిపోతున్నాయని, ఇంట్లోని సామాన్లు పాడైపోతున్నాయని వాపోయారు. అంతేకాకుండా వరద ఉధృతికి కాలనీలోని రోడ్లు పూర్తిగా కోతకు గురై, గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారాయని తెలిపారు. ఈ సమస్యపై మున్సిప