కొండపి: సింగరాయకొండ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు, రూ.9 లక్షలు నగదును అధికారులకు అప్పగించిన 108 సిబ్బంది
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ సమీపంలో సోమవారం లారీ, ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారు ఇద్దరు తండ్రి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహన సిబ్బంది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు నిజాయితీని చాటుకుంటూ గాయపడ్డ వారి వద్ద దొరికిన 9 లక్షల రూపాయలు నగదు ని అధికారులకు అప్పగించారు. నగదు వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.