రాయదుర్గం: బాదనహాల్ సమీపంలో ఈతకు వెళ్ళి కర్నాటక వాసి మృతి
డి.హిరేహాళ్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్ సమీప నీటి కుంటలో ఈతకు వెళ్ళి హంపన్న అనే వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం నాగసముద్రం గ్రామానికి చెందిన హంపన్న బార్య, పిల్లలతో కలిసి కల్యం గ్రామంలో శుభకార్యానికి వచ్చారు. మంగళవారం బంధువులతో కలిసి బాదనహాల్ సమీపంలో ఈతకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు ఈదుతూ నీటిలో మునిగి మరణించాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.